‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే! అసలు చిట్టా..’

MVV Satyanarayana: Chandrababu Passport Should Be Seized - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తమ అక్రమాలు బయటపడుతుడటంతో చంద్రబాబు, లోకేష్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌ల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఐటీ దాడులపై లోతైన విచారణ జరపాలని, బాబును కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అక్రమాస్తులను వెంటనే స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలని హితవు పలికారు. చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నాడని గతంలోనే తమ పార్టీ ఆరోపించిందని, అమరావతి, పోలవరం పేరుతో కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారని సత్యనారాయణ ఆరోపించారు. (‘టీడీపీ దివాళాకోరు తనానికి నిదర్శనం’)

బయట పడిన రెండు వేల కోట్ల అక్రమాలు వ్యవహారం కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు అక్రమాల సినిమా ఇంకా బయటపడాల్సి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ అన్నారు. మొదటి నుంచి టీడీపీ అక్రమాల గురించి వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చిందని తెలిపారు. విశాఖలో తక్కువ ధరకే కంపెనీలకు భూముల కేటాయింపు.. రికార్డులు మార్చి భూములు సొంతం చేసుకోవడం వంటి విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. అక్రమార్కులు శిక్షకు సిద్ధంగా ఉండాల్సిందేనన్నారు. (‘ఇది ఉల్లిపాయపై పొర మాత్రమే’)

చదవండి : ‘బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు..’

రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!

చంద్రబాబు అవినీతి బట్టబయలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top