‘అమ్మా’నుషం...! పసికందు గొంతు నులిమిన తల్లి.. | Mother murdered her Baby child | Sakshi
Sakshi News home page

‘అమ్మా’నుషం...! పసికందు గొంతు నులిమిన తల్లి..

Nov 17 2013 3:21 AM | Updated on Sep 2 2017 12:40 AM

తనకు ఉన్న ప్రాణాంతక వ్యాధి బిడ్డకు సోకిందని ఓ తల్లి ఆరు రోజుల శిశువు గొంతు నులిమి ఉసురు పోసుకుంది. పసికందు గొంతు కమిలి ఉండటంతో అనుమానించిన వైద్యులు నిలదీయటంతో నేరాన్ని ఒప్పుకుంది.

 సాక్షి, హైదరాబాద్: తనకు ఉన్న ప్రాణాంతక వ్యాధి బిడ్డకు సోకిందని ఓ తల్లి ఆరు రోజుల శిశువు గొంతు నులిమి ఉసురు పోసుకుంది. పసికందు గొంతు కమిలి ఉండటంతో అనుమానించిన వైద్యులు నిలదీయటంతో నేరాన్ని ఒప్పుకుంది. ఆమె భర్త ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలగూడ ఇంచార్జీ సీఐ ఖాజామొయినుద్ధీన్ తెలిపిన ప్రకారం.. పద్మారావునగర్ హమాలీబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ ఎం.కృష్ణ, అనిత భార్యాభర్తలు.

అనిత(25) ఈ నెల 10న గాంధీ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండకముందే పుట్టడంతో అనారోగ్యంతో ఉన్న శిశువుకు చికిత్సలు చేసి 13న డిశ్చార్జీ చేశారు. అయితే తనకు ఉన్న ప్రాణాంతక వ్యాధి బిడ్డకు సంక్రమించిదని భావించిన అనిత వస్త్రంతో శిశువు గొంతు నులమటంతో రక్తస్రావమైంది. దీంతో శిశువును 15న గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం చనిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement