breaking news
Padmarao nagar
-
‘అమ్మా’నుషం...! పసికందు గొంతు నులిమిన తల్లి..
సాక్షి, హైదరాబాద్: తనకు ఉన్న ప్రాణాంతక వ్యాధి బిడ్డకు సోకిందని ఓ తల్లి ఆరు రోజుల శిశువు గొంతు నులిమి ఉసురు పోసుకుంది. పసికందు గొంతు కమిలి ఉండటంతో అనుమానించిన వైద్యులు నిలదీయటంతో నేరాన్ని ఒప్పుకుంది. ఆమె భర్త ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలగూడ ఇంచార్జీ సీఐ ఖాజామొయినుద్ధీన్ తెలిపిన ప్రకారం.. పద్మారావునగర్ హమాలీబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ ఎం.కృష్ణ, అనిత భార్యాభర్తలు. అనిత(25) ఈ నెల 10న గాంధీ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండకముందే పుట్టడంతో అనారోగ్యంతో ఉన్న శిశువుకు చికిత్సలు చేసి 13న డిశ్చార్జీ చేశారు. అయితే తనకు ఉన్న ప్రాణాంతక వ్యాధి బిడ్డకు సంక్రమించిదని భావించిన అనిత వస్త్రంతో శిశువు గొంతు నులమటంతో రక్తస్రావమైంది. దీంతో శిశువును 15న గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం చనిపోయింది. -
ప్రియుడితో కలిసి బంధువు హత్య
హైదరాబాద్: పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మారావు నగర్ ఫేస్టూలోని బాపూనగర్‌లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రజిని అనే యువతి తన ప్రియుడితో కలిసి సమీప బంధవును హత్యచేసింది. ఆమె బంధువు కృష్ణచైతన్యరెడ్డి అనే యువకునికి తినే ఆహారంలో విషం కలపి ఇచ్చింది. దీంతో ఆ యువకుడు మృతిచెందాడు. ప్రియుడు సహాయంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనంతరం రజిని ఆ శవాన్ని గోనెసంచిలో కట్టి మాయం చేసేందుకు యత్నించినట్టు సమాచారం.