ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీ రేటు | More 66 Coronavirus Cases In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 2627కు చేరిన కరోనా కేసులు

May 24 2020 1:30 PM | Updated on May 24 2020 6:38 PM

More 66 Coronavirus Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2627కు చేరింది. గడిచిన 24 గంటల్లో 11,357 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 66 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా శుక్రవారం కొత్తగా 29 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1807కు చేరింది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 764 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ సాధించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3లక్షల 4వేల 326 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రికార్డ్ స్థాయిలో 68 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో 17 విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. కాగా 8 జిల్లాల్లో ఐసోలేషన్, ఆక్సిజన్ బెడ్లను ఏపీ ప్రభుత్వం పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా మృతులకు న్యూయార్క్‌ టైమ్స్‌ ఘన నివాళి
భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు

Advertisement
 
Advertisement
Advertisement