చంద్రబాబుని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ | Mohan babu and family meet chandrababu naidu at cm house in hyderabad | Sakshi
Sakshi News home page

చంద్రబాబుని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ

May 13 2015 9:45 AM | Updated on Aug 28 2018 4:30 PM

చంద్రబాబుని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ - Sakshi

చంద్రబాబుని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ

తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు ఆహ్వానించారు.

హైదరాబాద్: తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని  టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్బాబు ఆహ్వానించారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ చేరుకున్నారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని చంద్రబాబు కుటుంబసభ్యులను మోహన్బాబు ఫ్యామిలీ ఆహ్వానించింది.   

మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ ముహూర్తం మే 20 వ తేదీగా పెద్దలు నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం హైదరాబాద్లో జరగనుంది. ప్రణతి రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement