‘నాణ్యమైన బియ్యం పంపిణీకి సిద్ధం’ | Minister Sri Ranganatha Raju Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘నాణ్యమైన బియ్యం పంపిణీకి సిద్ధం’

Dec 10 2019 12:27 PM | Updated on Dec 10 2019 12:33 PM

Minister Sri Ranganatha Raju Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బురద చల్లుతున్నారని మంత్రి శ్రీరంగనాథ రాజు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ ద్వారా 3.50 లక్షలు టన్నులు ధాన్యం సేకరించామని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే 1.75 లక్షల టన్నులు సేకరించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లైకు కేంద్రం ఇచ్చిన నిధులను వేరే పథకాలకు చంద్రబాబు మళ్లించారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు సకాలంలో కొనుగోలు పై చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం పై మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. 25 లక్షలు టన్నుల నాణ్యమైన బియ్యం ఏప్రిల్ నుంచి పంపిణీ చేయడానికి  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీరంగ నాథ రాజు వెల్లడించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement