ఆ మాజీ మంత్రులు తప్పించుకోలేరు..! | Minister Sri Ranganatha Raju Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ స్కాం లో చంద్రబాబుకు వాటా ఉంది..

Feb 22 2020 7:38 PM | Updated on Feb 22 2020 7:51 PM

Minister Sri Ranganatha Raju Comments On Chandrababu - Sakshi

సాక్షి, పోడూరు: ఈఎస్ఐ స్కాం లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు.. అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కుమారుడి చేత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.(ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!)

ఈఎస్‌ఐ స్కాం లో చంద్రబాబుకు కూడా వాటా ఉందని మంత్రి శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. కార్మికుల్లో అధిక శాతం బీసీలే ఉంటారని అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులను చేస్తే.. వైఎస్‌ జగన్‌ పేద బీసీలను మంత్రులను చేశారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్‌ జగన్‌ తన కేబినెట్‌లో అవకాశం కల్పించారని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు.
(ఈఎస్‌ఐ స్కామ్‌ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు)

Advertisement
 
Advertisement
Advertisement