కామినేనిలో ఎంబీబీఎస్ విద్యార్ధి ఆత్మహత్య | Medico commits suicide in Narketpally Kamineni medical college | Sakshi
Sakshi News home page

కామినేనిలో ఎంబీబీఎస్ విద్యార్ధి ఆత్మహత్య

Nov 18 2013 9:04 AM | Updated on Oct 9 2018 7:43 PM

నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కామినేని కళాశాలలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్గొండ : నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కామినేని వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక  ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి సురేష్ హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. నార్కెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

కాగా విద్యార్థి ఆత్మహత్యపై మృతుని కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు చెబుతున్నారు. అయితే  ఆత్మహత్య విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంపై నోరు మెదపటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement