వివాహిత అనుమానాస్పద మృతి | Married Woman Suspicious Death In srikakulam | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Apr 1 2018 10:28 AM | Updated on Apr 1 2018 10:28 AM

Married Woman Suspicious Death In srikakulam - Sakshi

పోలాకి: మండలంలోని బొద్దాం గ్రా మానికి చెందిన వి వాహిత బొడ్డ రమ(27) శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రమ మృ తిపై స్థానికులు, మృ తురాలి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వారి కథనం ప్రకా రం వివరాలు ఇలావున్నాయి. నందిగాం మండలం రౌతుపురం గ్రామానికి చెందిన రమను పోలాకి మండలం బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను బొడ్డ వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2010 ఆగస్టు 12వ తేదీన వివాహం చేశారు. అప్పటి నుంచి విధినిర్వహణలో భాగంగా భర్త వెంకటేశ్వర్లు వివిధ చోట్లకు బదిలీ అవుతున్న నేపథ్యంలో అత్తవారి ఇంటి వద్ద అత్త, 

మామలతో కలిసి రమ బొద్దాంలో ఉంటోంది. వీరికి కుమార్తె లక్ష్మి(6), కుమారుడు మోహిత్‌(2) సంతానం ఉన్నారు. మొదటి నుంచి అత్తమామలతో చిన్న చిన్న తగాదాలు పడుతూవచ్చిన రమ కన్నవారి సహా యంతో గతంలో పెద్దల వద్ద పంచాయితీ కూడా పెట్టినట్టు సమాచారం. అయితే అత్తవారింటి వద్దవున్న రమ శనివారం తెల్లవారుజా మున మృతి చెందింది. ఈ విషయం రమ తల్లిదండ్రులకు తెలిసింది. దీం తో రమ తం డ్రి, తమ్ముడు, ఇతర బంధువులు బొద్దాం గ్రామానికి చేరుకుని బోరున విలపించారు.

 ఈ విషయంపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీఐ పైడిపునాయుడు సమక్షంలో ప్రాథమిక విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే రమ మామ బొడ్డ మురళి అలియాస్‌ పోలి నాయుడు, అత్త మణిమ్మలే చంపేశారని రమ తండ్రి, కుటుంబ సభ్యు లు ఆరోపించారు. రమ తండ్రి బడియ జనార్దనరావు ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ నారాయణస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ....
అయితే కోడలు మృతితో తమకు ఎటువంటి సంబంధంలేదని, గత వారం రోజులుగా రమ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుందని అత్తమామలు చెబుతున్నారు. నరసన్నపేటలోని వైద్యుని వద్దకు గురువారం తీసుకువెళ్లి చికిత్స అందించామని మృతురాలి మామ మురళి పోలీసులకు తెలిపాడు. శనివారం తెల్లవారుజామున కోడలు పరిస్థితి చూసి స్థానిక వైద్యుడిని తీసుకువచ్చే ప్రయత్నం చేశానని అప్పటికే రమ మృతిచెందిందని చెప్పుకొ చ్చాడు. అయితే మురళి మాటలను అటు పోలీసులు గాని, ఇటు మృతురా లి బంధువులు గాని నమ్మటం లేదు. ఆఖరికి స్థానికులు సైతం ఏదో జరిగేవుంటుందనే కోణంలోనే మాట్లాడుతుండటం గమనించదగ్గ విషయం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement