రూ.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం | Marijuana worth Rs.50 Lakhs seized | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Jan 23 2016 4:40 PM | Updated on Oct 9 2018 2:23 PM

పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన కారు డ్రైవర్ కారును దారి మళ్లించడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.

గోపాలపట్నం (విశాఖపట్నం) : పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన కారు డ్రైవర్ కారును దారి మళ్లించడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

శనివారం మధ్యాహ్నం గోపాలపట్నం వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి నగరంలోకి వస్తున్న బొలేరో వాహనం పోలీసులను గుర్తించి దారి మళ్లించడానికి ప్రయత్నించగా వాహనాన్ని వెంబడించి వాహనంతోపాటు అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement