గంజాయ్‌కి యువత చిత్తు ! | Marijuana leaves are widely available in the form of chocolates | Sakshi
Sakshi News home page

గంజాయ్‌కి యువత చిత్తు !

Apr 17 2026 5:35 AM | Updated on Apr 17 2026 5:35 AM

Marijuana leaves are widely available in the form of chocolates

అంగడి సరుకుగా మారిన గంజాయి 

పట్టుబడేది గోరంత... వినియోగం కొండంత 

మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత 

గంజాయి ఆకుతోపాటు చాక్లెట్ల రూపంలో విచ్చలవిడిగా లభ్యం 

వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి దిగుమతి 

గంజాయి రహిత రాష్ట్రం చేస్తామన్న బాబు హామీ సంగతేంటని ప్రజల మండిపాటు 

గంజాయి అంగడి సరుకుగా మారింది. మత్తుతో యువత చిత్తవుతున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి గంజాయి దిగుమతి అవుతోంది. సంబంధిత శాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడేది గోరంతయితే.. వినియోగం  కొండంతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

చీరాల అర్బన్‌:  చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటు అయ్యాక గంజాయి వినియోగం పెరిగింది. ఏడాదిలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు పదేపదే చెప్పారు. అయితే సాధారణ తనిఖీల్లోనే పెద్ద మొత్తంలో గంజాయి, చాక్లెట్లు  పట్టుబడుతుంటే  నియంత్రణ ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా విజనరీ ముందు చూపనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

ఎక్కడంటే అక్కడే... 
గతంలో గంజాయి వినియోగించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. అది కూడా ఎంతో రహస్యంగా వినియోగించేవారు. రైలు మార్గం ఉన్న ప్రాంతాల్లో ఒకింత ఎక్కువగా వినియోగం ఉండేది. అయితే బాబు పాలనలో గంజాయి దొరకని ప్రాంతం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిషేధిత గంజాయి సాగు చేసేది ఒకరు... రవాణా చేసేది మరొకరు. దాన్ని స్థానికంగా అందిపుచ్చుకునేది ఇంకొకరు. అక్కడి నుంచి నిర్ణీత ప్రదేశాలకు తరలించేది వేరొకరు. అంతిమంగా విక్రయించేది మరికొందరు. ఇది ఒక చైన్‌లా కొనసాగుతోంది. 

వైఎస్సార్‌సీపీ హయాంలో కట్టడి  
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణకుæ అధికారులు దిగారు. స్థానికంగా గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయటంతోపాటు మూలాలలోకి వెళ్లి సాగును సమూలంగా నాశనం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. ఆ క్రమంలో పోలీస్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, ఎస్‌బీ, సెబ్‌ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దుల వరకు గంజాయి సాగు ఎక్కడ ఉందో ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. గంజాయి లభ్యం కాకుండా ఉక్కుపాదం మోపారు. దాదాపు గంజాయి సాగు, రవాణా, విక్రయాలు తగ్గాయి. 

విద్యార్థులే లక్ష్యంగా.. 
గంజాయి విక్రేతలు విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్థానంలో గంజాయిని వారికి అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక తీర ప్రాంతాలలో వారాంతపు రోజుల్లో గంజాయి విక్రయాలు జోరుగా ఉంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. 

కట్టడి చేయటం సాధ్యం కాదా..? 
‘పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే కట్టడి చేయటం కష్టమేమీ కాదు. యాక్షన్‌ ప్లాన్‌ లీక్‌ కాకూడదు. రాజకీయ జోక్యం ఉండకూడదు. అందుకు ప్రజల స­హ­కారం కూడా అవసరంమని’ ఓ అధికారి తెలిపారు. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ జో­క్యం ఏదో ఒక స్థాయిలో ఉంది. కట్టడి అనేది మా­టలకే పరిమితం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement