వీఆర్వోపై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు | Man sentenced to 1 year for attacks revenue officer with knife | Sakshi
Sakshi News home page

వీఆర్వోపై దాడి చేసిన వ్యక్తికి ఏడాది జైలు

Sep 7 2015 5:05 PM | Updated on Sep 3 2017 8:56 AM

ఓ రెవెన్యూ ఉద్యోగిపై దాడి చేసి విధులకు ఆటంకపరిచినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రేపల్లె సినీయర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు.

రేపల్లె (గుంటూరు) : ఓ రెవెన్యూ ఉద్యోగిపై దాడి చేసి విధులకు ఆటంకపరిచినందుకు ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రేపల్లె సినీయర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో వీఆర్వో వర ప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన వెంకట రమణారావు అలియాస్ బుల్లిబాబు కత్తితో దాడి చేశాడు. ఈ విషయమై బాధితుడు కోర్టుకెక్కాడు. విచారణ అనంతరం రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి చక్రపాణి ఈ రోజు తీర్పు చెప్పారు. మద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement