భార్యను చంపిన ఆర్మీ ఉద్యోగి | Man kills wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన ఆర్మీ ఉద్యోగి

Jan 24 2016 1:51 PM | Updated on Jul 30 2018 8:29 PM

భార్యను కిరాతకంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించిన ఓ ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిజాంపట్నం (గుంటూరు) : భార్యను కిరాతకంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించిన ఓ ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఆదివారం వెలుగుచూసింది.

నిజాంపట్నంకు చెందిన లెనిన్(25) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా నివాసముంటున్న షీలం సూర్యగౌతమి(20)ని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీనికి ఇద్దరి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

కులాంతర వివాహం కావడంతో.. పెళ్లి సమయంలో వధువుకు 50 సెంట్ల భూమిని భరణంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మని భార్యతో గత కొన్ని రోజులుగా గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమెను హతమార్చి.. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్‌ల క్రింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement