మద్యం తాగుతూ వ్యక్తి మృతి | man dies while drinking alcohol | Sakshi
Sakshi News home page

మద్యం తాగుతూ వ్యక్తి మృతి

Dec 12 2015 5:35 PM | Updated on Oct 9 2018 5:43 PM

మద్యం తాగుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఒంగోలు : మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక సూర్యా వైన్స్ ముందు మద్యం తాగుతున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి వివరాలు సేకరిస్తున్నారు. వైన్స్ లోని మద్యాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement