మద్యం తాగుతూ వ్యక్తి మృతి
ఒంగోలు : మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక సూర్యా వైన్స్ ముందు మద్యం తాగుతున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి వివరాలు సేకరిస్తున్నారు. వైన్స్ లోని మద్యాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు.