‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్‌ ప్రతీ అడుగు’ | Malladi Vishnu Held A Rally On YS Jagan Birthday | Sakshi
Sakshi News home page

‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్‌ ప్రతీ అడుగు’

Dec 21 2019 2:38 PM | Updated on Dec 21 2019 8:43 PM

Malladi Vishnu Held A Rally On YS Jagan Birthday - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  బీఆర్టీఎస్‌ రోడ్డులో కేక్‌ కట్‌ చేసి పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరునెలల పాలనలో సీఎం జగన్‌ పథకాలను వివరిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని జై జగన్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ ముందుకు సాగుతున్నారని, ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని ప్రశంసించారు. అందరి సంక్షేమంతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి అందరి అభిప్రాయాలు సేకరించాకే ఎక్స్పర్ట్‌ కమిటీ మూడు రాజధానులపై సిఫార్సు చేసిందని స్పష్టం చేశారు.  అయిదేళ్లు ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన టీడీపీకి సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ దురుద్ధేశంతో టీడీపీ చేస్తున్న టీడీపీ కుట్రలను జనం గమనిస్తున్నారని, ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్‌ ప్రతీ అడుగు ముందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement