వైభవంగా మహాకాళి తిరునాళ్ళు | mahakali temple celebrations | Sakshi
Sakshi News home page

వైభవంగా మహాకాళి తిరునాళ్ళు

Mar 10 2015 4:10 PM | Updated on Sep 2 2017 10:36 PM

గుంటూరు జిల్లా నరసరావుపేట ఇస్సప్పాలెంలోని శ్రీ మహాకాళీ అమ్మవారి దేవస్థానం 40వ వార్షిక మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది.

గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావుపేట ఇస్సప్పాలెంలోని శ్రీ మహాకాళీ అమ్మవారి దేవస్థానం 40వ వార్షిక మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా తిరునాళ్ళను పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పొంగళ్ళు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి పూజలు జరిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.


పట్టణం నుంచి బాలప్రభలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చాయి. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల జాగరణ కోసం ఆలయప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement