రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య  | lovers commit suiside | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య 

Dec 18 2017 10:24 AM | Updated on Dec 18 2017 10:24 AM

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పిఠాపురం- గోర్స రైల్వే గేట్‌ దగ్గర ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన నందిన సూరిబాబుగా గుర్తించారు. యువతి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement