లిఖిత కిడ్నాప్‌ కథ సుఖాంతం | likhitha reached to parents | Sakshi
Sakshi News home page

లిఖిత కిడ్నాప్‌ కథ సుఖాంతం

Jun 8 2017 8:31 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఎట్టకేలకు లిఖిత(13) కిడ్నాప్‌ కథ సుఖాంతం అయ్యింది.

గుంటూరు: ఎట్టకేలకు లిఖిత(13) కిడ్నాప్‌ కథ సుఖాంతం అయ్యింది. సుమారు రెండు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయిన లిఖిత నేడు తల్లిదండ్రులను చేరుకోనుంది. భట్టిప్రోలుకు చెందిన లిఖిత రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది. అయితే తమ కుమార్తెను నాగేశ్వరరావు అనే మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాను కిడ్నాప్‌ చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో గాలించిన పోలీసులకు కనిపించలేదు. చివరకు జమ్మూకాశ్మీర్‌లో లిఖితను గుర్తించిన పోలీసులు, బాలికతో సహా గుంటూరు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో లిఖితను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే నిందితుడు మాత్రం దొరకలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement