అల్లూరి జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan paid tributes to freedom fighter Alluri Sitarama Raju | Sakshi
Sakshi News home page

అల్లూరి జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Jul 4 2026 8:36 AM | Updated on Jul 4 2026 11:40 AM

YS Jagan paid tributes to freedom fighter Alluri Sitarama Raju

సాక్షి, తాడేపల్లి: నేడు మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాల‌కు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయ‌న తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు పెట్టారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement