ఎన్‌టీపీఎస్‌ పరిసరాల్లో చిరుత సంచారం | Leopard creates scare at Vijayawada NTPS | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీఎస్‌ పరిసరాల్లో చిరుత సంచారం

Nov 22 2017 10:27 AM | Updated on Nov 22 2017 10:36 AM

Leopard creates scare at Vijayawada NTPS - Sakshi - Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఉన్న నార్ల తాతారావు థర్మల్ కోల్ ప్లాంట్ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కార్మికులు ఇళ్ళకు వెళుతున్న సమయంలో పొదల్లో తిరుగుతున్న చిరుత కనిపించింది. పక్కనే ఉన్న కొండపల్లి ఖిల్లా పరిసర అడవుల నుంచి చిరుత కిందకు వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు ప్రారంభించారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement