కౌలు రైతు రైతు ఆత్మహత్య | Lease farmer farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు రైతు ఆత్మహత్య

Jan 5 2016 4:42 PM | Updated on Oct 1 2018 2:44 PM

అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రామనాథ్ రెడ్డి(30) అనే రైతు మంగళవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు.

అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రామనాథ్ రెడ్డి(30) అనే రైతు మంగళవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు. వివరాలు.. కర్నూలు జిల్లా మద్దిగెర్ర కు చెందిన రామనాథ్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికి మండలం కిస్తిపాడు గ్రామంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వర్షాలు సరిగా లేక వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పుల పాలైయ్యాడు.  అప్పుతీర్చే మార్గం కానరాక.. సోమవారం పురుగుల మందు తాగాడు. ఇది గుర్తించిన స్థానికులు అతడిని హుటాహుటిన గుంతకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించచారు. కాగా.. రామనాథ్ రెడ్డి చికిత్సపొందుతూ మంగళవారం ఆస్పత్రిలో మృతి చెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement