భార్య చేతిలో భర్త హతం | Incident in Kurnool District | Sakshi
Sakshi News home page

భార్య చేతిలో భర్త హతం

May 31 2026 4:51 AM | Updated on May 31 2026 4:51 AM

Incident in Kurnool District

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో ఘాతుకం 

కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన 

ఆదోని అర్బన్‌: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్‌లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్‌కు చెందిన నల్లబోతుల మహేష్‌(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్‌  మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్‌ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement