మరోసారి బయటపడ్డ టీడీపీ భూకబ్జా బాగోతం | Land Grabbing By TDP Leaders In Mangalagiri | Sakshi
Sakshi News home page

మరోసారి బయటపడ్డ టీడీపీ భూకబ్జా బాగోతం

Oct 10 2019 4:14 PM | Updated on Oct 10 2019 7:55 PM

Land Grabbing By TDP Leaders In Mangalagiri - Sakshi

సాక్షి, మంగళగిరి : తెలుగుదేశం పార్టీ నేతల భూ కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. మంగళగిరిలోని ఆత్మకూరులో  తన స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని రైతు ఉమమహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 45 ఏళ్ల నుంచి ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, రెవెన్యూ అధికారులు పట్టా కూడా ఇచ్చారని చెప్పారు. తన స్థలాన్ని కబ్బా చేసి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని కోర్టు ఆశ్రయిస్తే.. స్టే ఇచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కబ్జా చేసిన స్థలంలో టీడీపీ ఆఫీసును నిర్మిస్తున్నారని మండిపడ్డారు.  తన పొలంలోకి రానివ్వకుండా రేకులు అడ్డు పెట్టారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement