'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని' | Krishna-Guntur ideal for new capital, says minister Narayana | Sakshi
Sakshi News home page

'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని'

Jun 18 2014 12:14 PM | Updated on Sep 2 2017 9:00 AM

'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని'

'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని'

కృష్ణా-గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ తెలిపారు.

హైదరాబాద్ : కృష్ణా-గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నందునే కృష్ణా-గుంటూరు మధ్యే రాజధానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

రాజధానికి 30 టీఎంసీల తాగునీటిని సమకూర్చుకోవాల్సి  ఉందని ఆయన అన్నారు. ఆ నీటిని రప్పించేందుకు కృషి చేస్తున్నామని నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముంపు సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఆగస్ట్ 10వ తేదీలోపు నివేదిక ఇవ్వనుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement