ఒక్కో టెస్టింగ్‌ కిట్‌ రూ.795; ఆ నోళ్లకు తాళం!

Karnataka Orders Corona Rapid Testing Kits At Rs 795 Each - Sakshi

50 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లకు కర్ణాటక ఆర్డర్లు

ఒక్కో కిట్‌ ధరకు రూ.795గా ఒప్పందం

అధిక ధర అంటూ గగ్గోలు పెట్టినవారికి చెంపపెట్టు

సాక్షి, విజయవాడ: కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక ధర చెల్లించిందనే పచ్చ పార్టీ నేతల నోళ్లు మూయించే విషయమొకటి బయటపడింది. దేశీయంగా తయారైన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.795 చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. ఈమేరకు హరియాణాలోని ఓ కంపెనీకి కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. యాభై వేల కిట్ల సరఫరాకు యడియూరప్ప సర్కార్‌ ఆర్డర్లు ఇచ్చింది.
(చదవండి: ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం)

కాగా, దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌కు రూ. 730 చొప్పున వెచ్చించి లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజ్ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది. కర్ణాటక కొనుగోలు ఆర్డర్లు బయటికిరావడంతో విమర్శకుల నోళ్లకు తాళం పడినట్టైంది.
(చదవండి: ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లు విడుదల)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top