‘రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తిన్నారు’ | Kanna Laxmi Narayana Fires On Chandrababu Naidu In Twitter | Sakshi
Sakshi News home page

‘రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తిన్నారు’

Feb 1 2019 4:21 PM | Updated on Feb 1 2019 8:39 PM

Kanna Laxmi Narayana Fires On Chandrababu Naidu In Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చూస్తుంటే ప్రజల రక్తం ఉడికిపోతోందని, మనిషిగా ఉండే అర్హతను ఆయన ఎప్పుడో కోల్పోయారని ట్వీట్‌ చేశారు. బీజేపీ నేతలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు.  

‘మీకు సిగ్గుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. రాష్ట్ర కోసం మీరేదో హెరిటేజ్‌ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భాషను సరిచేసుకోని క్షమాపణలు చెప్పాలి. మనిషిగా ఉండే అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయారు. నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్ర ఇచ్చిన లక్షల కోట్ల నిధులను దోచేసి ఇప్పుడు మమ్మల్నే తిడతావా?. రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తినేస్తు.. లెక్కలు అడిగితే యూటర్న్‌ తీసుకుని మాపై నిందలు వేస్తావా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement