కాకినాడలో వైద్య విద్యార్థి ఆత్మహత్య | kakinada: Medico's death suicide | Sakshi
Sakshi News home page

కాకినాడలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Feb 14 2014 5:22 PM | Updated on Oct 9 2018 7:43 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైద్య విద్యార్థి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైద్య విద్యార్థి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక గాంధీనగర్లోని తన ఇంట్లో శ్రీలక్ష్మి అత్యహత్యకు పాల్పడింది. రాజమండ్రిలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో శ్రీలక్ష్మి రేడియాలజీ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే కాలేజీ యజమాన్య వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రీలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

ఈ మేరకు శ్రీలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీలక్ష్మి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement