శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం | Jagan family to take part in Shobha Nagireddy's last rites | Sakshi
Sakshi News home page

శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం

Apr 24 2014 7:35 PM | Updated on Jul 25 2018 4:09 PM

శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం - Sakshi

శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ, షర్మిలలు శుక్రవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరగనున్న శోభా నాగిరెడ్డి అంతిమ సంస్కారాలలో పాల్గొననున్నారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ, షర్మిలలు శుక్రవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరగనున్న శోభా నాగిరెడ్డి అంతిమ సంస్కారాలలో పాల్గొననున్నారు. పార్టీ శానససభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రమాద వార్త వినగానే ఈ ముగ్గురు నేతలూ తమ తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ కు హుటాహుటిన వచ్చారు. రెండు రోజుల పాటు తమ ప్రచార కార్యక్రమాన్ని ఈ నేతలు రద్దు చేసుకున్నారు.
వైఎస్ విజయమ్మ కేర్ ఆస్పత్రికి వెళ్లి భూమా కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోభా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల సంతాప సూచకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దుచేసింది  
 

Advertisement
 
Advertisement
Advertisement