ఐటీ దాడులతో పచ్చ నేతల గుండెల్లో దడ..!

IT Raids Continue On Chandrababu Former PA Srinivas And Others - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాల తనిఖీలు టీడీపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. గురువారం మొదలైన సోదాలు శనివా రం రాత్రి అయినా ఆగకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో భయాలు మొదలవుతున్నాయి. నాలుగో రోజూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌​, తెలంగాణలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అతనికి చెందిన విజయవాడ గాయత్రీ నగర్‌లోని కంచుకోట ప్లాజాలో సోదాలు కొనసాగుతున్నాయి. రహస్య లాకర్‌ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్‌ సన్నిహితులు, బంధువుల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
(చదవండి : ఐటీ సోదాలు; టీడీపీ నేతల టెన్షన్‌)

ముంబై కేంద్రంగా ఉన్న బడా కంపెనీ నుంచి ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్ల ముడుపులు అందినట్టు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత బినామీ సంస్థల నుంచి జరిగిన నకిలీ లావాదేవీలను అధికారులు గుర్తించారు. లోకేశ్‌ సన్నిహితులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌, కిలారు రాజేష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరూ రూ.కోట్లలో లబ్ధి పొందినట్టు గుర్తించారు. లోకేష్‌ బినామీ కిలారు రాజేశ్‌ వందల కోట్ల ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం.

ఇద్దరు అరెస్ట్‌!
ఇదిలా ఉండగా, నారా లోకేష్‌కు అత్యంత సన్నిహి తులుగా పేరొందిన కిలారు రాజేష్, నరేన్‌ చౌదరిల కు చెందిన కంపెనీలపై జరిపిన సోదాల్లో నకిలీ ఇన్‌వాయిస్‌లు బయటపడినట్టు తెలుస్తోంది. వీటి ని సృష్టించడంలో కీలకపాత్ర పోషించిన ఆ కంపె నీకి చెందిన ఇద్దరి ఉద్యోగులను జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.  
(చదవండి : టీడీపీ నేత ఇంటిలో 30గంటల పాటు సోదాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top