ఎర్రచందనం అమ్మకాలతో రుణమాఫీ సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుడు హామీలతో ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షనాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుడు హామీలతో ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షనాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఎర్రచందనం అమ్మి రుణమాఫీకి. వినియోగిస్తామని చంద్రబాబు ఇస్తున్న హామీలను వైఎస్ జగన్ తప్పుపట్టారు. చంద్రబాబు, ఆయన మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం 15వేల టన్నుల ఎర్రచందనం అమ్మితే 1500 కోట్లు వస్తుందన్నారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడానికి 1500 కోట్లు ఎలా సరిపోతాయని వైఎస్ జగన్ నిలదీశారు.
రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే.. 1500 కోట్లు గురించి చంద్రబాబు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎవ్వరిని మోసం చేయడానికి చంద్రబాబు ఈ మాటలు చెప్తున్నారని ప్రశ్నించారు. 1500 కోట్లతో 1.2 లక్షల కోట్ల మాఫీ సాధ్యమేనా అని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలతో మోసగించిన రైతన్నలు, అక్కచెల్లెమ్మల కాళ్లుపట్టుకుని క్షమించమని చంద్రబాబు కోరాల్సింది పోయి మళ్లీ మోసం చేసే మాటలు చెప్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.