పుష్కర కాలువలో విద్యార్థి గల్లంతు | Intermediate student missing in Canal | Sakshi
Sakshi News home page

పుష్కర కాలువలో విద్యార్థి గల్లంతు

Oct 30 2015 2:56 PM | Updated on Nov 9 2018 5:02 PM

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది.

జగ్గంపేట (తూర్పు గోదావరి) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సలాడి వీరబాబు(16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో స్నేహితులతో కలిసి శుక్రవారం పుష్కర కాలువలో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement