ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి వరకు.. | Intercity Express extended up to Lingampally | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి వరకు..

Aug 14 2018 2:34 AM | Updated on Aug 14 2018 2:34 AM

Intercity Express extended up to Lingampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయవాడ–సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఈ మేరకు విజయవాడ–లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (నం.12795) సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55కి బయలుదేరి 11.04కి బేగంపేట చేరుకుంటుంది.

అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది. సోమవారం నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అలాగే లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 12796) మంగళవారం (14న) నుంచి లింగంపల్లిలో ఉదయం 4.40కి బయలుదేరుతుంది. 4.58కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్‌ చేరుతుంది. అక్కడ నుంచి 5.30కి బయలుదేరి 10.45కి విజయవాడకు చేరుకుంటుంది.  

ఇంటర్‌సిటీ ప్రత్యేక రైళ్లు..
హైదరాబాద్‌–విజయవాడ ఇంటర్‌సిటీ ప్రత్యేక రైళ్లను ఈ నెల 19 నుంచి అక్టోబర్‌ 28 వరకు ప్రతి ఆదివారం లింగంపల్లి వరకు నడపనున్నారు.  

లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌ సిటీ ప్రత్యేక రైలు (నం.07757) ప్రతి ఆదివారం ఉదయం 4.40కి లింగంపల్లి నుంచి బయలుదేరుతుంది. 4.58 గంటలకు బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 4.59కి బయలుదేరి 5.20కి సికింద్రాబాద్‌ చేరుతుంది. అక్కడ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, మంగళగిరి మీదుగా 10.45కి విజయవాడకు చేరుకుంటుంది.  

విజయవాడ–లింగంపల్లి ఇంటర్‌సిటీ ప్రత్యేక రైలు (నం.07758) ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. అక్కడ నుంచి మంగళగిరి, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా 10.50కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 11.04కి బేగంపేటకు చేరుకుని, అక్కడ నుంచి 11.05కి బయలుదేరి 11.35కి లింగంపల్లి చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement