'చంద్రబాబు దళిత ద్రోహి' | Injustice to SC and STs | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు దళిత ద్రోహి'

Dec 30 2014 2:27 PM | Updated on Sep 2 2017 6:59 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా దళితులకు రావలసిన వాటా ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుని ఖచ్చితంగా బోనులో నిలబెట్టాలని అన్నారు.

ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గుర్తులేదా? అని అడిగారు. ఇది దళితులను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. దళితుల హక్కులు ఎందుకు కాలరాస్తురని నాగార్జున అడిగారు.

Advertisement
 
Advertisement
Advertisement