breaking news
Dalita
-
కాంగ్రెస్ దళిత దండోరా సభాస్థలం మార్పూ
-
నేటి నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా
-
ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి
మచిలీపట్నం(చిలకలపూడి): దళితులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని డీఆర్వో సీహెచ్ రంగయ్య సూచించారు. అంబేడ్కర్‌భవన్‌లో దళిత బహుజన పరిరక్షణ సంఘ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్వో మాట్లాడుతూ రాజ్యాంగం లో దళితులకు పొందుపరచిన హక్కులు, చట్టాలు వివరించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళితులు ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఖైతేపల్లి దాసు పాల్గొన్నారు. డీఆర్వో రంగయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌కుమార్‌ను సత్కరించారు. సంఘ రాష్ట్ర కన్వీనర్ అన్నవరపు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఎగ్గోని గాంధీ పాల్గొన్నారు. -
'చంద్రబాబు దళిత ద్రోహి'
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా దళితులకు రావలసిన వాటా ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుని ఖచ్చితంగా బోనులో నిలబెట్టాలని అన్నారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గుర్తులేదా? అని అడిగారు. ఇది దళితులను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. దళితుల హక్కులు ఎందుకు కాలరాస్తురని నాగార్జున అడిగారు.