రేషన్‌ బియ్యం పట్టివేత | Illegal transportation of ration rice | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Sep 20 2018 9:36 AM | Updated on Sep 20 2018 9:36 AM

Illegal transportation of ration rice - Sakshi

ఉంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని బుధవారం ఉంగుటూరు టోల్‌గేటు వద్ద అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైకరం గ్రామానికి చెందిన కామన శ్రీనివాస్, విజయ త్రిమూర్తులు మినీ వ్యాన్‌లో 42 బస్తాల రేషన్‌ బియ్యాన్ని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా ఉంగుటూరు వద్ద పట్టుకున్నట్టు చేబ్రోలు ఎస్సై తాడి నాగ వెంకటరాజు తెలిపారు. బియ్యాన్ని ఉంగుటూరు సివిల్‌ సప్లయీస్‌ డీటీ జయశ్రీకి అప్పగించారు. కామన శ్రీనివాస్‌ పరారీలో ఉండగా విజయ త్రిమూర్తులను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement