టీడీపీలో చేరే ఆలోచన లేదు- జలీల్ ఖాన్ | i-never-leave-ysr-congress-party-says-jaleel-khan | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరే ఆలోచన లేదు- జలీల్ ఖాన్

Feb 11 2016 1:13 PM | Updated on Aug 14 2018 11:26 AM

టీడీపీలో చేరే ఆలోచన లేదని వైఎస్ఆర్ సీపీ నేత, విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు.

విజయవాడ: టీడీపీలో చేరే ఆలోచన లేదని వైఎస్ఆర్ సీపీ నేత, విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్టు ఆయన తెలిపారు.  గురువారం ఉదయం మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలిసి జలీల్ ఖాన్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం నగరంలోని గుప్త కల్యాణమండపంలో జరిగిన ముస్లిం మేధావుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.  నియోజక వర్గ అభివృద్ది కోసమే ముఖ్యమంత్రిని కలిసానని, అంత మాత్రాన పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. చివరి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement