భార్యను చంపేసి తప్పించుకుందామనుకుని.. | husband murdered his wife | Sakshi
Sakshi News home page

భార్యను చంపేసి తప్పించుకుందామనుకుని..

Feb 25 2015 5:49 PM | Updated on Jul 30 2018 8:29 PM

తన అర్ధాంగిని కిరాతకంగా హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకుందామనుకునుకున్న ఓ నిందితుడు చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు.

డి.హీరేహళ్ (అనంతపురం): తన అర్ధాంగిని కిరాతకంగా హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకుందామనుకునుకున్న ఓ నిందితుడు చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మలెన్న తన భార్య నాగవేణి(28)ని ఆదివారం రాత్రి హత్య చేశాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. జరిగింది ఆత్మహత్య అంటూ ప్రచారం చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నాగవేణిని భర్త మలెన్న హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు. దీంతో మలెన్నను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement