breaking news
Nagaveni
-
భార్యను చంపేసి తప్పించుకుందామనుకుని..
డి.హీరేహళ్ (అనంతపురం): తన అర్ధాంగిని కిరాతకంగా హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకుందామనుకునుకున్న ఓ నిందితుడు చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మలెన్న తన భార్య నాగవేణి(28)ని ఆదివారం రాత్రి హత్య చేశాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. జరిగింది ఆత్మహత్య అంటూ ప్రచారం చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నాగవేణిని భర్త మలెన్న హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు. దీంతో మలెన్నను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. -
నగర కమిషనర్ నాగవేణి బదిలీ?
నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ పి.నాగవేణి బదిలీ కానున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనున్నట్లు సమాచారం. ఆమెను అనంతపురం కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు గుంటూరు నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను నియమించనున్నారు. ఈ ఏడాది మార్చి 14న నాగవేణిని తాత్కాలిక కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. రెండు నెలల క్రితం విశాఖపట్నం జేసీ ప్రవీణ్‌కుమార్‌ను నగరపాలకసంస్థ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అక్కడ హుదూద్తుఫాన్ రావడం, తర్వాత జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆయన్ను రిలీవ్ చేయకపోవడం వంటి కారణాలతో ఆయన ఇక్కడ జాయిన్‌కాలేదు. దీంతో నగర కమిషనర్ పి.నాగవేణిని అనంతపురం కమిషనర్‌గా బదిలీచేసి, ఆమె స్థానంలో జేసీ శ్రీధర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.