వివాహేతర సంబంధం ఆ కుటుంబానికి శాపమైంది. ఎంత చెప్పినా భార్య పద్ధతి మార్చుకోలేదని ఆగ్రహించిన భర్త గొంతుకోసి హత్య చేశాడు. ఆనక తానూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య
Sep 7 2013 4:28 AM | Updated on Aug 24 2018 2:33 PM
	సత్తెనపల్లి రూరల్, న్యూస్‌లైన్ : వివాహేతర సంబంధం ఆ కుటుంబానికి శాపమైంది. ఎంత చెప్పినా భార్య పద్ధతి మార్చుకోలేదని ఆగ్రహించిన భర్త గొంతుకోసి హత్య చేశాడు. ఆనక తానూ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆవేశం కన్నబిడ్డలను అనాథలను చేసింది. ఈ ఘటన సత్తెనపల్లి మండలం అబ్బూరులో శుక్రవారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... అబ్బూరు గ్రామానికి చెందిన నూతలపాటి వేణుబాబు(35)కు క్రోసూరు మండలం హుస్సేన్‌నగర్‌కు చెందిన అనూష(30)తో ఏడేళ్ల  క్రితం వివాహమైంది.
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 వీరు తమ పొలంతో పాటుగా మరి కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయ చేస్తుంటారు. వీరికి అవినాష్, వెంకటేష్ అనే ఇద్దరు కుమారులు. భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భావించిన భర్త ఆమెను పలుమార్లు మందలించాడు. ఈ విషయంపై దంపతులిద్దరూ తరచూ గొడవ పడేవారు. అనూషతో సన్నిహితంగా మెలిగిన సమయంలో ప్రియుడు వీడియో తీసి, డబ్బు కోసం బెదిరిం చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో వేణుబాబు కుటుం బంతో సత్తెనపల్లి వె ళ్లేందుకు సిద్ధమై అక్కడ ఐదెకరాల పొలం  కౌలుకు తీసుకున్నట్లు అనుష బావ హనుమంతురావు పోలీసులకు తెలిపాడు.
	 అనూష భర్తతో కలిసి గురువారం సత్తెనపల్లిలోని అక్క, బావల వద్దకు వెళ్లింది. అద్దె ఇల్లు కుదుర్చుకుని పిల్లలను అక్కడే వదిలి వచ్చింది.  శుక్రవారం సాయంత్రం కుమారుడి ఇంటికి వచ్చిన వేణుబాబు తల్లి అచ్చాయమ్మ రక్తపు మడుగులో కోడలు, విగతజీవిగా కొడుకు పడి ఉండటం చూసి విషయం స్థాని కులకు తెలిపింది.  పోలీసులు ఘట నాస్థలాన్ని పరిశీలించారు. వేణుబా బు అనూష గొంతుకోసి, అనంతరం పురుగుమందు తాగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వివరించారు.  సత్తెనపల్లి డీఎస్పీ జగదీశ్వరరెడ్డి స్థానికులు, కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
