భార్యను కొట్టి చంపిన భర్త | Husband kills wife | Sakshi
Sakshi News home page

భార్యను కొట్టి చంపిన భర్త

Nov 24 2015 2:53 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త కొట్టడంతో భార్య మృతిచెందింది.

రైల్వేకోడూరు (వైఎస్సార్‌ జిల్లా) : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త కొట్టడంతో భార్య మృతిచెందింది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నజీర్(32) హోటల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య మొబీనా(28)తో తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో భార్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నజీర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement