విజయవాడ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత | High Tension in Vijayawada Municipal Office  | Sakshi
Sakshi News home page

విజయవాడ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

Jun 5 2018 2:26 PM | Updated on Oct 16 2018 6:27 PM

High Tension in Vijayawada Municipal Office  - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు కార్పొరేషన్‌లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement