భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం | Heavy rush at Mantralayam | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం

Mar 6 2016 11:02 AM | Updated on Sep 3 2017 7:09 PM

శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది.

మంత్రాలయం (కర్నూలు) : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో స్నానమాచిరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఏకదాశి కావడంతో రాఘవేంద్రస్వామి నిర్మల బృందావన దర్శనం భక్తులకు అందుబాటులో ఉంది. స్వామి వారి దర్శనం కోసం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement