కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు.
అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.
గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీష్‌లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు.


