తూర్పు, పశ్చిమ ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు | Heavy rains: Rivulets breach in Agency areas | Sakshi
Sakshi News home page

తూర్పు, పశ్చిమ ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు

Oct 26 2013 8:50 AM | Updated on Sep 2 2017 12:00 AM

తూర్పు, పశ్చిమ ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు

తూర్పు, పశ్చిమ ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి ఏజెన్సీలో వాగులు ఉప్పొంగుతున్నాయి.

విశాఖ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి ఏజెన్సీలో వాగులు ఉప్పొంగుతున్నాయి. మారేడుమిల్లి-భద్రాచలం మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. దాంతో రాజమండ్రి-చత్తీస్గఢ్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే రాజమండ్రి సమీపంలోని  ప్రత్తిపాడు వద్ద సుద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.జంగారెడ్డిగూడెం ఏజెన్సీలో జల్లేరు, అలివేరు, భయనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అలాగే ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 2,500 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement