breaking news
rivulet
-
వాగులో కొట్టుకుపోయిన 20 గొర్రెపిల్లలు
కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం నాయినిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పెద్దవాగు ఉధృతి అమాంతం పెరిగి గొర్రె పిల్లలు కొట్టుకుపోయాయి. అనంతపురంలో భారీగా వర్షాలు కురవడంతో వాగు ఉధృతి పెరగటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓబయ్య, చిన్నయ్య అనే ఇద్దరు రైతులకు చెందిన 20 గొర్రె పిల్లలు కొట్టుకుపోయాయి. -
తూర్పు, పశ్చిమ ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు
విశాఖ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి ఏజెన్సీలో వాగులు ఉప్పొంగుతున్నాయి. మారేడుమిల్లి-భద్రాచలం మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. దాంతో రాజమండ్రి-చత్తీస్గఢ్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే రాజమండ్రి సమీపంలోని ప్రత్తిపాడు వద్ద సుద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.జంగారెడ్డిగూడెం ఏజెన్సీలో జల్లేరు, అలివేరు, భయనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అలాగే ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 2,500 క్యూసెక్కులుగా ఉంది.