టెంపో - జీపు ఢీ: నలుగురికి గాయాలు | four injured in tempo and jeep accident | Sakshi
Sakshi News home page

టెంపో - జీపు ఢీ: నలుగురికి గాయాలు

Jun 19 2015 10:30 AM | Updated on May 25 2018 2:06 PM

వేగంగా వెళ్తున్న టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీ కొట్టింది. నిత్యం వ్యాజ్యదారులతో కిక్కిరిసిపోయే అసోంలోని ఒక కోర్టుకు గురువారం ఊహించని అతిథులు వచ్చారు.

రాజంపేట (వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీ కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం జైపాస్ రోడ్డులో జరిగింది. వివరాలు.. మద్యం సేవించి డ్రైవర్ టెంపో నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి.

అంతేకాకుండా జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement