శ్రీవారి సేవలో దేవెగౌడ | former prime minister deve gowda visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో దేవెగౌడ

May 18 2016 8:38 PM | Updated on Sep 4 2017 12:23 AM

మాజీ ప్రధాని దేవెగౌడ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

తిరుమల: మాజీ ప్రధాని దేవెగౌడ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వాగతం పలికారు. దేవెగౌడ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో దేవెగౌడను వేద పండితులు ఆశీర్వదించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement