ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి | Five killed in road mishap in kurnool district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి

Oct 24 2014 8:21 AM | Updated on Apr 4 2019 5:24 PM

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి - Sakshi

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ సమీపంలో గుత్తి ఆర్టీసీ డిపోకు చెందిన ...

కర్నూలు : కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పత్తికొండ సమీపంలో ఉదయం ఆరు గంటలకు ఈ  ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి గుత్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కాశీరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా చిరువ్యాపారులు. వివిధ గ్రామాల్లో బట్టలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. పెద్దహుల్తి గ్రామంలో జరుగుతున్న దీపావళి తిరునాళ్లలో వ్యాపారం చేసుకునేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జమ్మక్క అనే గర్భవతికి రెండు కాళ్లు విరిగిపోయాయి.

ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు పెద్దయ్య, లక్ష్మన్నలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కూడా గాయపడ్డాడు. బాధితులంతా పత్తికొండ రాజీవ్ నగర్ వాసులు.  క్షతగాత్రులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement