నాటు తుపాకితో కాల్పులు: రైతుకు గాయాలు | Firing in Ravikamatham | Sakshi
Sakshi News home page

నాటు తుపాకితో కాల్పులు: రైతుకు గాయాలు

Jan 12 2016 2:52 PM | Updated on Oct 2 2018 2:30 PM

గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

రావికమతం (విశాఖపట్టణం) : గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందల పెంటయ్య తన పొలానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి నాటుతుపాకీతో అతనిపైకి కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పెంటయ్యను మొదట అనకాపల్లి ఆస్పత్రికి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement